అవకాశాలతో ‘ఆహా’ అనిపిస్తోన్న భామలు - upcoming actresses article
close
Updated : 30/03/2021 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవకాశాలతో ‘ఆహా’ అనిపిస్తోన్న భామలు

తొలి చిత్రం విడుదలవక ముందే పలు సినిమాలు ప్రకటిస్తూ ‘అ!’ అనిపిస్తున్నారు. వెండితెరకు పరిచయమవకుండానే యువ హృదయాల్లో గూడు కట్టుకుంటున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ హాట్‌ టాపిక్‌గా మారుతోన్న నవ యువ నాయికలపై ఓ లుక్కేద్దాం...

‘ఉప్పెన’లా..

వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’తో తెరంగేట్రం చేసింది కృతి శెట్టి. ఈ సినిమా గతేడాదే విడుదలవాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఈ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో విడుదలైనా ఇందులోని పాటలు (లిరికల్‌ వీడియో) సినీ అభిమానులపై మంచి ప్రభావం చూపాయి. కృతిశెట్టి హావభావాలకు అంతా ఫిదా అయిపోయారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? అనేంతగా కృతిశెట్టి మాయ చేసింది. ప్రేక్షకులనే కాదు పరిశ్రమ వారినీ తన అభినయంతో ఆకర్షించింది కృతి. అందుకే ఈ చిత్రం విడుదల కాకుండానే ‘శ్యామ్‌ సింగరాయ్‌’కి సంతకం చేసింది. నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కిస్తున్నారు. దీంతోపాటు సుధీర్‌ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్‌- లింగుస్వామి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఓ చిత్రాన్ని ఇటీవలే ప్రకటించింది.

హిట్‌ అందుకుంది..

సుశాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో నటిగా మారింది మీనాక్షి చౌదరి. దర్శన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగానే రవితేజ సరసన ‘ఖిలాడి’లో ఆడిపాడుతోంది మీనాక్షి. ఈ సినిమాకు రమేశ్‌ వర్మ దర్శకుడు. దీంతోపాటు ‘హిట్‌ 2’ని ఖరారు చేసింది. అడివి శేష్‌ కథానాయకుడిగా శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న చిత్రమిది.

రొమాంటిక్‌గా కనిపించి..

ఆకాశ్‌ పూరితో ‘రొమాంటిక్‌’ సన్నివేశంలో కనిపించి కుర్రకారుని హీటెక్కిచింది కేతిక శర్మ. అనిల్‌ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర గ్లింప్స్‌లో హాట్‌గా దర్శనమిచ్చి అందరినీ తనవైపు తిప్పుకుంది. అలా ఈ చిత్రం విడుదలకు ముందే  నాగశౌర్య సరసన ‘లక్ష్య’లో నటించే అవకాశం అందుకుంది. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మరోవైపు వైష్ణవ్‌ తేజ్‌కి జోడీగా ఓ చిత్రంలో నటించబోతుందని సినీ వర్గాల సమాచారం. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేసిన గిరీశయ్య దర్శకత్వం వహించనున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని