వైష్ణవ్‌ కొత్త చిత్రం ఆరంభం - vaishnav tej new movie launch
close
Published : 02/04/2021 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైష్ణవ్‌ కొత్త చిత్రం ఆరంభం

హైదరాబాద్‌: వైష్ణవ్‌తేజ్‌ తన మూడో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేశారు. ఆయన కథానాయకుడిగా గిరీశయ్య దర్శకత్వంలో ఓ నూతన చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ దీనిని నిర్మిస్తున్నారు. ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతికా శర్మ కథానాయిక. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయిధరమ్‌తేజ్‌ నటీనటులపై ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

‘ఉప్పెన’తో మొదటి ప్రయత్నంలోనే కథానాయకుడిగా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు వైష్ణవ్‌ తేజ్‌. మరోవైపు, క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాలో వైష్ణవ్‌ నటించారు. ఈ సినిమా షూట్‌ చాలా వరకూ పూర్తైనట్లేనని సమాచారం. ఇందులో వైష్ణవ్‌కు జోడీగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కనిపించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని