అతడు @ హర్భజన్‌ 2.0..   - watch better version of harbhajan singh bowling action
close
Published : 11/03/2021 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతడు @ హర్భజన్‌ 2.0.. 

హైబ్రిడ్‌ వెర్షన్‌ అంటూ యువీ కామెంట్‌..

(Photo: Harbhajan Singh Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అంటే తెలియని క్రికెట్‌ ప్రేమికుడు ఉండరు. మైదానంలో అతడి వికెట్ల ప్రదర్శనకే కాకుండా బౌలింగ్‌ యాక్షన్‌కు సైతం మంచి గుర్తింపు ఉంటుంది. భజ్జీ బౌలింగ్‌ చేసే ముందు తన రెండు చేతులు తిప్పుతూ బంతులు విసురుతాడనే విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడతడు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఓ వీడియో నవ్వులు పూయిస్తోంది.

ఎందుకంటే అందులో ఒక యువ క్రికెటర్‌ అచ్చం హర్భజన్‌ సింగ్‌లానే బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు. కానీ, ఇక్కడే మీరు గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. సాధారణంగా భజ్జీ బౌలింగ్‌ చేసే సమయంలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తన చేతుల్ని గాల్లో తిప్పుతూ బంతులు విసురుతుంటాడు. కానీ అతడు పంచుకున్న వీడియోలో ఆ క్రికెటర్‌.. ఏకంగా ఐదుసార్లు చేతులు తిప్పుతూ కనిపించాడు. ఇది చూడడానికి ఆసక్తిగానే కాకుండా నవ్వులు కూడా పంచుతోంది. ఎవరో ఆ వీడియోను తనకు పంపించగా, భజ్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని సరదాగా అందరికీ పరిచయం చేశాడు.

‘నా కన్నా అత్యుత్తమ వెర్షన్‌. ఈ వీడియో పంపిన వ్యక్తికి ధన్యవాదాలు. ఆ యువ క్రికెటర్‌ బౌలింగ్‌ చేస్తుంటే బంతి తిరుగుతుందో లేదో తెలియదు. కానీ అతడి చేతులు మాత్రం గిరగిరా తిరుగుతున్నాయి’ అంటూ ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. దీనికి మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందిస్తూ ‘హైబ్రిడ్‌ వెర్షన్‌’ అని అంతే సరదాగా కామెంట్‌ చేశాడు. అయితే, అలా విపరీతంగా చేతులు తిప్పుతూ బౌలింగ్‌ చేసిన వ్యక్తి పేరు తనూజ్‌ పవార్ అని తెలిసింది. అతడిది దిల్లీకి సమీపంలోని మహిపాల్‌పూర్‌. స్థానికంగా క్రికెట్‌ ఆడుతుంటాడని, ఒంటి చేత్తో సిక్సర్లు బాదగల సమర్థుడని స్థానికంగా మంచి గుర్తింపు లభించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని