కాలక్షేపానికి లాటరీ టికెట్‌ కొని.. ₹7 కోట్లు గెలుచుకుంది! - woman bought lottery ticket after flight was cancelled
close
Published : 06/08/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాలక్షేపానికి లాటరీ టికెట్‌ కొని.. ₹7 కోట్లు గెలుచుకుంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదృష్టం ఎప్పుడు.. ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో.. రాత్రికిరాత్రి ఎవరిని కోటీశ్వరులుగా మారుస్తుందో చెప్పడం కష్టం. ఒక్కోసారి లాటరీల రూపంలోనూ తలుపుతడుతుంటుంది. అనుకోకుండా కలిసొచ్చిన ఈ అదృష్టం వల్ల కూటికి లేని వాళ్లు కూడా కోటీశ్వరులు అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అమెరికాలోని మిస్సోరిలోని కానాస్‌ సీటీకి చెందిన 51 ఏళ్ల ఏంజెలా కారావెల్లా తాను ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో కాలక్షేపంగా లాటరీ టిక్కెట్‌ కొని ఏకంగా ₹ 7కోట్లు గెలుచుకుంది. "నా విమానం ఊహించని విధంగా రద్దు అయ్యింది. తరువాత ఏదో విచిత్రమైన విషయం జరగబోతోందని నాకు అనిపించింది. ఆ సమయంలో కాలక్షేపానికి కొన్ని స్క్రాచ్-ఆఫ్ టిక్కెట్లు కొన్నా. అవే నాకు కోట్లు తెచ్చిపెట్టాయి!" అని ఏంజెలా తన ఆనందాన్ని పంచుకుంది. కారావెల్లా టాంపాకు తూర్పున ఉన్న బ్రాండన్‌లోని పబ్లిక్స్ సూపర్ మార్కెట్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేయగా.. ఈ టిక్కెట్‌ విక్రయించినందుకు స్టోరుకు 2వేల డాలర్లు దక్కాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని