2006 తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాతో టెస్టు - womens team india will play test against australia after england tour
close
Published : 18/05/2021 21:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2006 తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాతో టెస్టు

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే నెల ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత టీమ్‌ఇండియా మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతోనూ ఒక టెస్టు మ్యాచ్ ఆడనుందని బీసీసీఐ అధికారి ఒకరు మంగళవారం మీడియాకు చెప్పారు. 2006లో చివరిసారి కంగారూ జట్టుతో టెస్టు మ్యాచ్‌ ఆడిన భారత మహిళా జట్టు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌ క్రికెట్‌లో తలపడనుంది. మరోవైపు ఇంగ్లాండ్‌తోనూ ఏడేళ్ల క్రితం టెస్టు మ్యాచ్‌లో తలపడగా మళ్లీ ఇప్పుడు జూన్‌ 16 నుంచి తర్వాతి మ్యాచ్‌ ఆడనుంది.

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మహిళల జట్లు ఇంకా టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నాయని, ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా సైతం ఇకపై ఆ రెండు జట్లతో ప్రతి పర్యటనలో ఒక్కో టెస్టు ఆడుతుందని ఆ అధికారి స్పష్టంచేశారు. పురుషుల క్రికెట్‌లో పింక్‌బాల్‌ టెస్టు మాదిరిగానే మహిళల క్రికెట్‌లో ఇలా ఆ రెండు జట్లతో టెస్టు మ్యాచ్‌లు ఆడించాలని గతనెల అపెక్స్‌ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టీమ్‌ఇండియా ఈ రెండు జట్లతో స్వదేశంలో తలపడినా, ఆయా దేశాలకు వెళ్లినా ఒక టెస్టు మ్యాచ్‌ ఆడతుందని అన్నారు. మరోవైపు, ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత ఆస్ట్రేలియా షెడ్యూల్‌ ఇంకా ఖరారు కానప్పటికీ సెప్టెంబర్‌లో టీమ్‌ఇండియా కంగారూ గడ్డపై పర్యటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇంగ్లాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత క్రికెటర్లు బుధవారం ముంబయికి చేరుకొని క్వారంటైన్‌కు వెళ్లనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని