
వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచారు శ్రీనివాసరెడ్డి. ‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘ఢమరుకం’లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. తొలిసారి ఆయన ఓ థ్రిల్లర్ కథని ఎంచుకున్నారు. అదే.. ‘రాగల 24 గంటల్లో’. ఈషారెబ్బా, సత్యదేవ్ జంటగా నటించారు. త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో ముచ్చటించారు.
ఇది ఎలాంటి చిత్రం?
స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే చిత్రం. సినిమా మొదలైన తొలి ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకుడు బయటి ప్రపంచాన్ని మరచి లీనమైపోతాడు. తరవాత ఏం జరుగుతుందనే ఆసక్తి చివరివరకూ కొనసాగుతూ ఉంటుంది.
వినోదాత్మక చిత్రాలే చేసిన మీరు ఇప్పుడు జోనర్ మార్చారేంటి?
నా శైలిలోనే వినోదాత్మక చిత్రం చేద్దామని కృష్ణభగవాన్‌తో కలిసి స్క్రిప్టు పనులు మొదలెట్టాం. అదే సమయంలో ఈ కథ విన్నాను. నచ్చడంతో నా కథని పక్కన పెట్టి, దీన్ని పట్టాలెక్కించాం. ప్రస్తుతం థ్రిల్లర్ చిత్రాలకు ఆదరణ బాగుంది. అలా ట్రెండ్‌కి తగిన చిత్రమిది. పైగా దర్శకుడు అనేవాడు ఎలాంటి కథలనైనా చేయగలగాలి.
ఈ టైటిల్‌కీ కథకూ సంబంధం ఏంటి?
24 గంటల వ్యవధిలో జరిగే కథ ఇది. సాధారణంగా ‘రాగల 24 గంటల్లో..’ అనేది వాతావరణ సూచన చెప్పడానికి వాడే పదం. ఈ సినిమా ఓ భారీ వర్షంతో మొదలవుతుంది. ఆ నేపథ్యం ఈ కథకు బాగా ఉపయోగపడింది. అందుకే ఈ పేరు పెట్టాం.
ఈషారెబ్బాని ఎంచుకోవడానికి కారణమేంటి?
ఏ పాత్రకు ఎవరు కావాలనుకున్నామో వాళ్లే దొరికారు. ఓ రకంగా ఇది కథానాయిక నేపథ్యంలో సాగే చిత్రం. ఈషా రెబ్బా గతంలో చేయని పాత్ర ఇది. సత్యదేవ్ చాలా మంచి నటుడు. చాలా రోజుల తరవాత శ్రీరామ్ తెలుగులో నటించారు.
మీ శైలి వినోదం ఇందులో ఉంటుందా?
నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. కానీ ఇందులో అలాంటి సన్నివేశాలు ఉండవు. ఈ జోనర్ నుంచి బయటకు వెళ్లలేదు.
‘ఢమరుకం’ తరవాత విరామం ఎక్కువ తీసుకున్నారు..?
‘ఢమరుకం’ విడుదలైన రోజే ఓ పెద్ద హీరో సినిమా చేద్దాం అన్నారు. అదే సమయంలో నాగార్జున ‘చైతూతో సినిమా చేయండి’ అన్నారు. అలా ‘హలో బ్రదర్’ సీక్వెల్ మొదలైంది. స్క్రిప్టు కోసం పది నెలలు కష్టపడ్డాం. కానీ అనుకోకుండా ఆగిపోయింది. తరవాత ‘దుర్గా’ సినిమాని చైతన్యతో మొదలెట్టాం. అదీ ముందుకు వెళ్లలేదు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. దీంతో విరామం వచ్చేసింది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!