close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాకు న్యాయం చెప్పడానికి ఇంకెన్నేళ్లు?

‘‘మనిషిగా పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్‌ పడుతుంది. కానీ, నాకు న్యాయం చెప్పడానికేంటి సర్‌ ఇన్ని సంవత్సరాలు పడుతోంది’’ అని ప్రశ్నిస్తున్నారు అల్లరి నరేష్‌. ఇప్పుడాయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్నారు. మంగళవారం నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను కథానాయకుడు విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ‘‘దేశ  వ్యాప్తంగా 2015 నాటికి 29 రాష్ట్రాల్లో 1401 జైళ్లు ఉన్నాయి. 3,66,781 మంది ఖైదీలు రకరకాల శిక్షలు అనుభవిస్తున్నారు. అందులో దాదాపు 2,50,000 తప్పు చేశామో, చేయలేదో తెలియకుండా అండర్‌ ట్రైల్‌ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు’’ అంటూ ఆసక్తికరంగా సాగే సంభాషణతో టీజర్‌ను చూపించారు. ఈ చిత్రంలో నరేష్‌ ఓ అండర్‌ ట్రైల్‌ ఖైదీగానే చూపించారు. ఆయన పాత్ర చాలా విభిన్నంగా కనిపించింది. మరి ఆయన ఎందుకు జైలుకు రావాల్సి వచ్చింది? ఆయనపై ఉన్న అభియోగాలేంటి? అన్నది తెలియాలంటే ఈ చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు. ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ప్రియదర్శి, ప్రవీణ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సంభాషణలు: అబ్బూరి రవి, కళ:బ్రహ్మ కడలి, ఛాయాగ్రహణం: చోటా.కె.నాయుడు.


నవ్వుల బుల్లోడు

అల్లరి నరేష్‌ పుట్టినరోజు కానుకగా  ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న మరో చిత్రం ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్‌ను మంగళవారమే విడుదల చేశారు. నరేష్‌ శైలిలో సాగే వినోదాత్మక కథతో చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్‌ను బట్టీ తెలుస్తోంది. ఇందులో ఆయన బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపించారు. బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన బంగారాన్ని బయట వాళ్లకు అద్దెకు ఇస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. దీని వల్లే అనుకోకుండా కొన్ని సమస్యల్లో చిక్కుకుంటాడు. మరి ఆ సమస్యలేంటి?, వాటి నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు? అన్నది ఈ చిత్ర కథాంశం నరేష్‌కు జోడీగా పూజా జవేరి నటిస్తోంది. పివి.గిరి దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.