తొలిసారి ఇలాంటి కథలో
close
Updated : 05/08/2021 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలిసారి ఇలాంటి కథలో

రుణ్‌ సందేశ్‌, ఫర్నాజ్‌ శెట్టి జంటగా దర్శకుడు ఎమ్మెస్సార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇందువదన’. మాధవి ఆదుర్తి నిర్మాత. శివ కాకాని స్వరాలందించారు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘‘నేనింత వరకు చేయని విభిన్నమైన పాత్రని ఇందులో పోషించా. ఇలాంటి కథలో నటించడం నాకిదే తొలిసారి. ఇంత మంచి కథను నాకిచ్చినందుకు దర్శకుడికి థ్యాంక్స్‌. ఫర్నాజ్‌ తన పాత్ర కోసం చాలా కష్టపడింది. ఆ కష్టం తెరపై అందరికీ కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలు ప్రకటిస్తామ’’ని దర్శక నిర్మాత తెలియజేశారు. ఈ సినిమాకి కూర్పు: కోటగిరి వెంకటేశర్వరావు, ఛాయాగ్రహణం: బి.మురళి కృష్ణ.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని