close
హాలీవుడ్
మరోసారి రాక్షస బల్లుల బీభత్సం

రాక్షస బల్లులు మరోసారి వెండితెరపై బీభత్సం సృష్టించడానికి రాబోతున్నాయి. అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ‘జురాసిక్‌ వరల్డ్‌: డామినియన్‌’ వచ్చేవరకూ ఆగాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ‘జురాసిక్‌ పార్క్‌’ ఫ్రాంఛైజీలో తెరకెక్కుతున్న ఆరో చిత్రమిది. గత చిత్రాలను మరిపించే రీతిలో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర దర్శకుడు కొలిన్‌ ట్రెవొరే ట్విటర్‌లో క్లాప్‌బోర్డ్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఇదే ఫ్రాంఛైజీలో 2015లో వచ్చిన ‘జురాసిక్‌ వరల్డ్‌’ చిత్రానికి కూడా కొలిన్‌ ట్రెవొరేనే దర్శకుడిగా వ్యవహరించారు. ఆ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన క్రిస్‌ప్రాట్‌, బ్రిస్‌ డల్లాస్‌ హొవార్డ్‌ తదితరులు ఈ కొత్త చిత్రంలో మళ్లీ అవే పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఫ్రాంఛైజీలో తొలి రెండు చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్‌ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.