న్యాయవాదిగా సూర్య?
close
Published : 10/05/2021 14:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

న్యాయవాదిగా సూర్య?

కోర్టులో వాదించడమూ తెలుసు... కోటు తీసి కొట్టడమూ తెలుసు అంటూ పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’గా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఓ మాస్‌ హీరో నల్ల కోటు ధరిస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో అందులో చూశాం. ఇప్పుడు మరో హీరో ఆ కోటులో కనిపించి వినోదం పంచనున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. ఆ హీరో ఎవరో కాదు... సూర్య. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య 39వ చిత్రం రూపొందుతోంది. అందులో సూర్య... న్యాయవాదిగా కనిపించనున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే ఆయన తొలిసారి ఈ పాత్రలో కనిపించినట్టు అవుతుంది. తమిళంతోపాటు తెలుగులోనూ బలమైన మార్కెట్‌ని సొంతం చేసుకున్న కథానాయకుడు సూర్య. ఆయన నటించే దాదాపు సినిమాలు తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ఎప్పటికప్పుడు విలక్షణమైన పాత్రల్లో కనిపిస్తుంటారు సూర్య. ‘ఆకాశం నీ హద్దురా’లో విమానయాన సంస్థ వ్యవస్థాపకుడిగా మారిన ఓ సామాన్య యువకుడిగా కనిపించి అలరించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని