close
Published : 19/02/2021 18:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అడవి బాటలో మహేష్ బాబు - రాజమౌళి?

ఇంటర్నెట్ డెస్క్: తెలుగులో అగ్ర హీరోతో దర్శకధీరుడి సినిమా అంటే ఎన్ని భారీ అంచనాలుంటాయో ఇప్పటికే మనం చూశాం. ప్రస్తుతం రాజమౌళి తన దృష్టంతా ‘ఆర్.ఆర్.ఆర్’పైనే పెట్టారు. ఈ చిత్రం తరువాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నారు. ఎలాంటి కథలో తమ హీరోని చూపిస్తారా? అని సూపర్‌స్టార్‌ అభిమానులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో ఓ టాక్‌ నడుస్తోంది. బాహు భాషా చిత్రంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి కె.విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనే కథ గురించి తండ్రీ కొడుకులు చర్చించుకున్నారట. ఆఫ్రికా అడవుల్లో సాగే, యాక్షన్‌ అడ్వెంచర్ కథాంశంతో కూడిన లైన్‌ను మహేశ్‌కు వినిపించారట. ఆయన కూడా ఓకే చెప్పారని టాక్‌. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని టాక్‌. ‘ఆర్.ఆర్.ఆర్’ అక్టోబర్ 13న విడుదలైన వెంటనే, రాజమౌళి సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్‌ బాబు  ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకుక్కుతున్న సినిమా షూటింగ్ దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని