‘ఒకే ఒక లోకం’ ఫుల్‌ సాంగ్‌ చూశారా? - oke oka lokam nuvve song
close
Published : 25/04/2021 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఒకే ఒక లోకం’ ఫుల్‌ సాంగ్‌ చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందిన గీతాల్లో ‘ఒకే ఒక లోకం నువ్వే’ ఒకటి. ఆది సాయి కుమార్‌, సురభి జంటగా నటించిన ‘శశి’ చిత్రంలోనిదీ గీతం. తాజాగా ఫుల్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులోని అందమైన లొకేషన్లు, నాయకానాయికల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్‌ రచించిన ఈ గీతానికి అరుణ్‌ చివులూరు స్వరాలు సమకూర్చారు. సిధ్ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ మధురగీతం సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పాట లిరికల్‌ వీడియోను 100 మిలియన్లకి పైగా (యూ ట్యూబ్‌లో) వీక్షించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్‌ నాయుడు దర్శకత్వం వహించారు. శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆర్పీ వర్మ,రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించారు. ఈ సినిమా మార్చి 19 ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని