ఇంటర్నెట్ డెస్క్:‘జెంటిల్మెన్’ ‘భారతీయుడు’ ‘అపరిచితుడు’లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్. ప్రస్తుతం రామ్‌చరణ్ కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం శంకర్‌కు 15వ సినిమా, అలాగే రామ్‌చరణ్‌కు కూడా ఇది 15వ చిత్రమవడం విశేషం. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చరణ్ - రష్మిక పేరును శంకర్, దిల్‌రాజులకు సూచించాడని చెప్పుకుంటున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆ సంస్థకు 50వ చిత్రం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని 3డీ ఫార్మాట్లో చిత్రీకరించాలని దర్శకుడు శంకర్ యోచిస్తున్నాడట. మరో వైపు అనిరుధ్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడనే వార్తలొస్తున్నాయి. రష్మిక దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్లో సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తోన్న ’మిషన్ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తోంది. రష్మిక చాలా బిజీగా ఉన్నప్పటికీ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకోనుందని సినీవర్గాల సమాచారం.
ఇదీ చదవండి:
నటుడిగా కాదు.. బాధితుడిగా ఇక్కడికొచ్చా: తారక్
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని