స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
ఇంటర్నెట్ డెస్క్: శర్వానంద్ కథానాయకుడుగా బి.కిశోర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ నాయిక. వ్యవసాయం ప్రధానాంశంగా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 11న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో టైటిల్ గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా ఈ పాట(లిరికల్ వీడియో) విడుదలైంది.
‘శ్రీకారం కొత్త సంకల్పానికి.. కలలు చిగురిస్తున్న సంతోషం ఇది, శ్రీకారం కొత్త అధ్యాయానికి.. చిగురు పరిమళమల్లె దీవిస్తున్నదీ పుడమి’ అంటూ సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేదిగా ఉంది. వ్యవసాయం మనకు కొత్త కాదు మన తాతల కృషి.. జీన్స్ వేసుకున్నా ఆ కళ మన జీన్స్‌లో ఉంది అంటూ సాహిత్యంతో యువతలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు రచయిత రామజోగయ్య శాస్త్రి. మిక్కీ జె. మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను పృథ్వీ చంద్ర చక్కగా ఆలపించారు. రావు రమేశ్, ఆమని, నరేశ్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్