Anasuya: ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ ఓటీటీలో... - thank you brother on ott
close
Published : 26/04/2021 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anasuya: ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ ఓటీటీలో...

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనసూయ భరద్వాజ్‌, అశ్విన్‌ విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. రమేశ్‌ రాపర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో మే 7 నుంచి ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. ‘సాధ్యమైనంత సురక్షిత మార్గంలో మీకు వినోదం పంచుతుండటం అదృష్టంగా భావిస్తున్నాం. ఆనందించండి’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల తేదీని ప్రకటించారు అనసూయ. ఈ చిత్రాన్ని ‘ఆహా’ సమర్పణలో మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారక్‌ భూమిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మౌనికారెడ్డి, ఆదర్శ్‌ బాలకృష్ణ, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. గుణ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని