Most Eligible Bachelor: అందుకే ఎక్కువ సమయం - telugu news Bommarillu Bhaskar Latest Interview On Most Eligible Bachelor Success
close
Updated : 17/10/2021 07:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Most Eligible Bachelor: అందుకే ఎక్కువ సమయం

‘‘నా సినిమా సినిమాకి గ్యాప్‌ వస్తుందని, వెనకబడి పోతున్నానని నేనెప్పుడూ టెన్షన్‌ పడను. నేను తీసే సినిమాతో ప్రేక్షకులకు ఎంత మంచి విషయం చెబుతున్నానన్నదే నాకు ముఖ్యం’’ అన్నారు    దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌. ఇప్పుడాయన దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బన్నీవాసు, వాసు వర్మ నిర్మించారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు భాస్కర్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

‘‘ప్రతి పెళ్లి వేడుకలా జరుగుతుంది. అయితే పెళ్లి తర్వాత ఎలా బతకాలి అన్న విషయంలో ఎవరికీ స్పష్టత ఉండదు. అసలు వివాహం తర్వాత కాపురం సాఫీగా సాగడానికి కావాల్సిన  అర్హతలేంటి? అన్నది మనకు తెలియదు. ఈ అంశాన్ని ఓ ఆసక్తికర కథనంగా చెప్పాలి.. అదీ సున్నితమైన వినోదంతో ఆకట్టుకునేలా చూపించాలి అన్న ఉద్దేశంతో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చేశాం. మనలో ఉన్న ఓ ఎమోషన్‌ని మనసులో ఉన్న ఓ వ్యక్తికి చెప్పాలనుకున్నప్పుడు.. ఆ టైమ్‌కి వాళ్లు రాకపోతే కలిగే బాధని వర్ణించలేము. ఆ బాధ ఎలా ఉంటుందనేది దీంట్లో ఆసక్తికరంగా చూపించాం. దీనికి అఖిల్‌, పూజా హెగ్డే తమదైన నటనతో ప్రాణం పోశారు’’.

* ‘‘బొమ్మరిల్లు’ నుంచి ఇప్పుడీ చిత్రం వరకు నా సినిమాలన్నింటిలో నేనెక్కడో ఫీలైన విషయాల్నే కథగా చెప్పే ప్రయత్నం చేశా. నేను ఇన్నేళ్లలో కొన్నే చిత్రాలు చేయడానికి ఓ కారణముంది. నేనేదైనా విషయాన్ని తీసుకుంటే.. దాని గురించి పరిపూర్ణంగా ఆలోచించడానికే ఎక్కువ టైం పట్టేది. ‘ఒంగోలు గిత్త’ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో ఓ మల్టీస్టారర్‌ చేద్దామనుకున్నా. ఇందుకు ముగ్గురు పెద్ద హీరోలు, నలుగురు నాయికల్ని అనుకున్నా. వారి డేట్స్‌ సర్దుబాటు కాక ఆ చిత్రం ఆగిపోయింది. ప్రస్తుతం నా దగ్గర ఇంకొన్ని కథలున్నాయి. అవి  ఎవరితో చేస్తానన్నది త్వరలో తెలియజేస్తా’’.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని