Cinema News: అదృష్టం తలుపు తట్టినా...తీయలేదు - telugu news celebrities rejected hollywood movie offers
close
Updated : 09/09/2021 11:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: అదృష్టం తలుపు తట్టినా...తీయలేదు

హాలీవుడ్‌ అవకాశాలను చేజార్చుకున్న బాలీవుడ్‌ తారలు

నటనకు, నటుడికి హద్దులు ఉండవంటారు. మంచి పాత్ర కోసం ఏ భాషల్లో నటించడానికైనా సిద్ధంగా ఉంటేనే నటుడిగా ఎక్కువమందికి చేరువకాలుగుతారు. విశ్వవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాలంటే ఉన్న దారి హాలీవుడ్‌. అక్కడ ఛాన్స్‌ వస్తే అదో బంగారు అవకాశమే. ఎందుకంటే హాలీవుడ్‌ అంటే ప్రపంచమంతా చూస్తారు. అద్భుతంగా నటిస్తే విశ్వవ్యాప్తంగా అభిమానులు దక్కుతారు. అందుకే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె లాంటి భామలు హాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ప్రియాంక అయితే అక్కడి వాణ్నే పెళ్లి చేసుకొని మరింత వేగంగా హాలీవుడ్‌లో ముందు కెళుతుంది. కానీ ఈ ఇద్దరూ ఒకప్పుడు హాలీవుడ్‌ భారీ చిత్రాల్లో నటించే  అవకాశాన్ని వదిలేసుకున్నారు. ఈ ఇద్దరే కాదు షారుక్‌ ఖాన్, హృతిక్‌ రోషన్, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ లాంటి అగ్ర నటులు రకరకాల కారణాలతో అదే పని చేశారు. మరి వీళ్లంతా ఏ కారణాలతో గోల్డెన్‌ ఛాన్స్‌లను మిస్‌ చేసుకున్నారో చదివేద్దాం!

దీపికా పదుకొణె

2017లో విన్‌ డీజిల్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ట్రిప్లెక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ చిత్రంతో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది దీపికా పదుకొణె. ఇప్పుడు మరో భారీ హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. 2015లోనే దీపికాకు విన్‌ డీజిల్‌ నటించిన ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 7’లో ఛాన్స్‌ వచ్చింది. కాల్షీట్లు కుదరకపోవడంతో నో చెప్పేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 7’ విషయంలో నా నిర్ణయం ఆ పరిస్థితుల్లో తప్పుకాద’’ని చెప్పింది.

ఐశ్వర్యరాయ్‌

‘ప్రొఓక్డ్‌’, ‘బ్రిడ్జ్‌ అండ్‌ ప్రీజ్యుడిష్‌’, ‘పింక్‌ పాంథర్‌ 2’ తదితర చిత్రాల్లో ఐశ్వర్య నటించింది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.  2004లో వచ్చిన ‘ట్రోయ్‌’ చిత్రంలో ఐశ్వర్యకు అవకాశం వచ్చింది. వసూళ్లు కొల్లగొట్టిన ఆ చిత్రంలో నటించడానికి ఆమె అంగీకరించలేదు. శృంగార సన్నివేశాల గాఢత ఎక్కువగా ఉండటంతో ఆమె ఆ ఛాన్స్‌ను వదలుకున్నారు

ప్రియాంక చోప్రా

అందాల నాయిక ప్రియాంక చోప్రా ఇప్పటికే పలు హాలీవుడ్‌ చిత్రాల్లోనూ, సిరీస్‌ల్లోనూ నటించింది.  ఇంతలా అక్కడ సందడి చేస్తున్న ప్రియాంక గతంలో ఓ భారీహాలీవుడ్‌ ఛాన్స్‌ను వదులుకొంది. 75 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి 226 మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన ‘ఇమ్మోర్టల్స్‌’లో నటించమని ప్రియాంకను అడిగారు. ఆ సమయంలో ఆమె కాల్షీట్లు ఖాళీగా లేకపోవడంతో వదిలేసుకుంది. ఆ సమయంలో ‘7 ఖూన్‌ మాఫ్‌’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఓ మాదిరి విజయంతో సరిపెట్టుకుంది. అప్పుడే ప్రియాంక హాలీవుడ్‌లో నటించి ఉంటే ఆమె కెరీర్‌ మరో స్థాయిలో ఉండేదేమో!

హృతిక్‌ రోషన్‌

హృతిక్‌ రోషన్‌ ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తాడంటూ ఏళ్ల తరబడి వార్తలొస్తున్నా ఆయన నటించింది లేదు. హాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌ పాంథర్‌ 2’లోని విసెంట్‌ పాత్ర కోసం హృతిక్‌నే సంప్రదించారు. తన బిజీ షెడ్యూల్స్‌ కారణంగా ఆయన ఆ ఛాన్స్‌ను వదిలేసుకున్నారు.

షారుక్‌ఖాన్‌

కింగ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌గా పేరు తెచ్చుకున్న షారుక్‌ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. హాలీవుడ్‌లో ఆయనకి మంచి పేరుంది. ఈయన ఆస్కార్‌ పురస్కారాలు గెలుచుకున్న ‘స్లమ్‌ డాగ్‌ మిలీయనీర్‌’ లాంటి చిత్రంలో అవకాశాన్ని వదులుకున్నారు. ఇందులో క్విజ్‌ మాస్టర్‌ పాత్రని షారుక్‌ కాదనడంతో అనిల్‌కపూర్‌ నటించారు. ఈ విషయం గురించి ఓ సందర్భంలో షారుక్‌ మాట్లాడుతూ ‘‘నేను అలాంటి ఓ షో చేశాను. ఆ చిత్రంలో నటిస్తే మళ్లీ అలాంటి షో చూసిన అనుభూతే ప్రేక్షకులకు కలుగుతుంది. అందుకే ‘స్లమ్‌ డాగ్‌ మిలీయనీర్‌’లో నటించలేదు’’అని చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని