Bollywood: ఈసారి అంతకుమించి - telugu news katrina kaif more glamorous in tiger 3
close
Published : 02/08/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: ఈసారి అంతకుమించి

ముంబయి: కత్రినాకైఫ్‌ అంటే సోయగాల సుకుమారే కాదు హీరోలకు దీటుగా గన్‌ పట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తూ యాక్షన్‌ సత్తా చాటగలదని నిరూపించిన చిత్రం ‘టైగర్‌ జిందా హై’. అంతకుముందు ఎప్పుడూ కత్రినా  ఆ స్థాయిలో డిష్యుం డిష్యుం అంటూ ఫైటింగులు చేసింది లేదు. ఇందులో జోయా పాత్రలో సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఆదరగొట్టిన కత్రిన ‘టైగర్‌ 3’లో అంతకుమించి పోరాటాలు చేయనుంది. తన కెరీర్‌లోనే ఇప్పటివరకూ చేయని కష్టమైన పోరాట సన్నివేశాల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ‘‘టైగర్‌ 3’లో కత్రినా యాక్షన్‌ పవరేంటో చూపించబోతుంది. సోలోగా ఇప్పటివరకూ ఏ కథానాయిక చేయని స్థాయి పోరాటాల్ని కత్రినా చేయనుంది. భారతీయ తెరపై ఈ స్థాయి పోరాటాలు ఏ నాయిక చేయలేదు. దీని కోసం భారీగా వర్కవుట్లు చేస్తూ కష్టపడుతోంది కత్రిన’’అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ‘టైగర్‌ 3’ చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. ఆ తర్వాత ఈ నెల మూడో   వారంలో విదేశాల్లో షెడ్యూల్‌ ఉంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని