
హైదరాబాద్: సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఎంటర్టైన్మెంట్ గేమ్ షో ‘క్యాష్’. ఎప్పటిలాగానే వచ్చే శనివారం ‘క్యాష్’లో కొంతమంది జబర్దస్త్ సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. ‘జబర్దస్త్’లో లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న తన్మయి, శాంతి స్వరూప్, పావని, మోహన, వినోదిని, హరిత, సాయి తదితరులు... తమ ఒరిజినల్ రూపాన్ని చూపించనున్నారు. అలాగే తాము జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ‘క్యాష్’ సెట్లో పంచుకోనున్నారు. ప్రోగ్రామ్‌లో భాగంగా మోహన్.. సుమను సరదాగా ‘ఆంటీ’ అంటూ నవ్వులు పూయించనున్నారు. అదే విధంగా వినోదినితో కలిసి సుమ ఓ సరదా స్కిట్ చేయనున్నారు. ‘సుమ వార్తలు’ కాన్సెప్ట్‌తో రానున్న ఈ స్కిట్లో భాగంగా వినోదిని వేసే బంతి సుమకు తాకగా.. మిగిలిన వారంతా ‘సుమ జిందాబాద్..వినోదిని డౌన్ డౌన్’ అంటూ వేసే పంచులు ఆకట్టుకోనున్నాయి.
‘ఎప్పుడూ లేడీ గెటప్స్ అంటుంటారు కదా.. నిజం ఇలా ఉంటుంది’ అంటూ జబర్దస్త్ ‘లేడీ’స్ తమ నిజ రూపం చూపించనున్నారు. అలాగే పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి అని అందరినీ సుమ అడిగింది. ‘కుటుంబ పోషణ కోసం మాత్రమే ఈ గెటప్స్ వేస్తున్నాం.. వృత్తిపరంగా మాత్రమే చూస్తూ, నిజం ఇలా ఉంటుందని అర్థం చేసుకునే అమ్మాయి వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాం’ అని శాంతి స్వరూప్ చెప్పనున్నారు. అలాగే తమ జీవితానుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను తెలియజేస్తూ కన్నీటి పర్యంతమవనున్నారు. వచ్చే శనివారం (నవంబర్ 28) ప్రసారం కానున్న ‘క్యాష్’ ప్రోమోను చూసేయండి..!
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి