Vijay Sethupathi: ‘విక్రమ్‌’లో మక్కల్‌ సెల్వన్‌ - vijay sethupathi plays a key role in vikram movie
close
Published : 18/05/2021 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay Sethupathi: ‘విక్రమ్‌’లో మక్కల్‌ సెల్వన్‌

చెన్నై: ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ చిత్రాలతో మెప్పించిన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెర కెక్కిస్తున్న సినిమా ‘విక్రమ్‌’. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా విజయ్‌సేతుపతి నటిస్తున్నాడని వస్తున్న వార్తలు నిజమవుతున్నాయి. దక్షిణాదిలో తీరికలేని నటుడిగా ఉన్న  విజయ్‌సేతుపతి ఇప్పటికే డేట్స్‌ సర్దుబాటు కాక చాలా సినిమాలు వదులుకున్నారు. ఎలాగైనా కమల్‌హాసన్‌తో నటించే అవకాశాన్ని వదులుకోనని చెప్పిన సేతుపతి... ఇప్పుడు ‘విక్రమ్‌’లో నటించడానికి అంగీకరించాడని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇదే చిత్రంలో ఫాహద్‌ ఫాజిల్‌ కూడా ఓ ముఖ్యపాత్రలో కన్పించనున్నారు. కమల్‌హాసన్, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ లాంటి అద్భుతమైన నటులతో తెరకెక్కుతున్న ‘విక్రమ్‌’పై అంచనాలు పెరిగిపోతున్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని