
తాజావార్తలు
సంగీత దర్శకుడు రఘుకుంచె
హైదరాబాద్: ‘ఎందుకే రమణమ్మ.. పెళ్లేందుకే రమణమ్మ’ పాటతో సంగీత ప్రియుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు రఘు కుంచె. ‘బంపర్ ఆఫర్’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సంగీత దర్శకుడిగా తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు ఆయన. ‘ఆహ నా పెళ్లంట’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘దొంగాట’ వంటి చిత్రాలతో గుర్తుండిపోయే పాటలనూ అందించారు. ప్రస్తుతం ఆయన స్వరాలు సమకూర్చిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. ఈనెల 22న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకర్లతో రఘుకుంచె సరదాగా ముచ్చటించారు.
‘థ్రిల్లర్ కథలకు నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణమే ప్రధాన బలం. అందుకే దాదాపు నెల రోజులు రీ-రికార్డింగ్కే సమయం కేటాయించాం. ఇందులో మూడు పాటలే ఉంటాయి. తెరపై కనిపించేవి రెండు. ఒకటి ప్రచార గీతం. నిజానికి థ్రిల్లర్లకు పాటలు అడ్డుగా అనిపిస్తాయి. కానీ, ప్రేక్షకులకు రిలీఫ్‌గా ఉండాలనే ఉద్దేశంతో పాటలు పెట్టాం. దర్శకుడు తొలి సీన్ నుంచే ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లిపోతారు. సాధారణంగా థ్రిల్లర్లకు డెప్త్, లౌడ్ అని రెండు రకాల ఆర్ఆర్లు ఇస్తుంటారు. ఈరోజుల్లో ప్రేక్షకులు లౌడ్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకే ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని కాస్త బలంగానే ఇచ్చాను. ఈ చిత్రంతో ‘రఘు థ్రిల్లర్లు కూడా చేయగలడు’ అనే నమ్మకం అందరిలోనూ కలుగుతుంది’.
‘సంగీత దర్శకుడిగా నాకిది 19వ చిత్రం. శ్రీనివాస్‌రెడ్డితో ఇది నా రెండో చిత్రం. గతంలో ఆయన తెరకెక్కించిన ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రానికి స్వరాలు సమకూర్చాను. వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించడంలో శ్రీనివాస్‌రెడ్డికి మంచి పట్టుంది. ‘రాగల 24 గంటల్లో’ చిత్రాన్ని మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ జోనర్లో పనిచేయడం నాకిదే తొలిసారి. కథలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. ప్రధమార్థంలో చూపించిన చిక్కుముళ్లను ద్వితియార్థంలో రివీల్ చేసిన విధానం హైలైట్‌గా ఉంటుంది. కథ ఆద్యంతం ఈషా చుట్టూనే తిరుగుతున్నప్పటికీ ఇందులోని ప్రతి చిన్న పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. నేపథ్య సంగీతం చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేవి, కలకాలం గుర్తుండేవి పాటలే’
‘సంగీత దర్శకుడిగా నా ప్రయాణంలో అనుకున్నంత వేగం లేనప్పటికీ, నా పని పట్ల సంతృప్తిగానే ఉన్నా. చిత్రసీమలో ఎవరి కెరీర్నైనా జయాజపజయాలే నిర్ణయిస్తుంటాయి. పూరి జగన్నాథ్.. ‘దేవుడు చేసిన మనుషులు’కి స్వరకర్తగా నన్ను తీసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డా. దానికోసం ఎంతో కష్టపడి పాటలు చేశా. దర్శకుడికి, ప్రేక్షకులకీ అందరికీ నచ్చాయి. కానీ, చిత్ర ఫలితం అనుకున్నంత స్థాయిలో రాకపోవడం వల్ల నాకూ ఆశించినంత పేరు రాలేదు. ప్రస్తుతం నటుడిగా ‘పలాస’ చిత్రంలో నటిస్తున్నా. నాది ప్రతినాయక పాత్ర. ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం. దర్శకుడు అడగటం వల్ల చేశా.ఆ చిత్రానికి స్వరాలు కూడా సమకూరుస్తున్నా’.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ