AP News: టిప్పర్‌కు కరెంట్‌ తీగలు తగిలి ముగ్గురి మృతి

తాజా వార్తలు

Updated : 09/08/2021 12:57 IST

AP News: టిప్పర్‌కు కరెంట్‌ తీగలు తగిలి ముగ్గురి మృతి

డ్రైవర్‌ను కాపాడబోయి ఇద్దరు యువకుల మృతి

పాలసముద్రం: కంకర తరలిస్తున్న టిప్పర్‌కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పాలసముద్రం మండలం కనికాపురంలో జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. కనికాపురంలో ఇల్లు నిర్మించుకుంటున్న మునిస్వామి నాయుడు తన అవసరాల కోసం టిప్పర్‌లో కంకరు తెప్పించారు.

కంకరను అన్‌లోడ్‌ చేసే సమయంలో విద్యుత్ తీగలు గమనించని డ్రైవర్ మనోజ్‌‌.. టిప్పర్ వెనక భాగం పైకెత్తాడు. ఈ క్రమంలో టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి కరెంట్‌ ప్రవహించింది. దీంతో డ్రైవర్‌ కేకలు వేశాడు. పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన యువకులు జ్యోతీశ్వర్‌(19), దొరబాబు(23) స్పందించారు. మనోజ్‌ను కాపాడే క్రమంలో విద్యుదాఘాతంతో వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని