మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
close

తాజా వార్తలు

Published : 21/10/2020 12:54 IST

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

30 అడుగుల లోయలో పడ్డ బస్సు

ముంబయి: వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని నందుర్బార్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మల్కాపుర్ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు తెల్లవారుజామున 3.15 గంటలకు  కొండైబారి ప్రాంతంలో అదుపుతప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొన్నాయి.  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని