బాలికపై తండ్రి, ప్రియుడు అత్యాచారం 

తాజా వార్తలు

Published : 13/10/2020 00:29 IST

బాలికపై తండ్రి, ప్రియుడు అత్యాచారం 

ముంబయి: మహారాష్ట్రలోని థానేలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక (17)పై తండ్రి, ఆమె ప్రియుడు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. థానే జిల్లాలోని వాసింద్‌ పట్టణంలో మూడు రోజుల క్రితం రోడ్డు పక్కన పడి ఉన్న పిండాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ పిండం ఓ బాలికకు చెందినదిగా గుర్తించారు. అనంతరం సదరు బాలికను విచారించగా ఆమె విస్తుపోయే విషయాలు వెల్లడించింది. ఉపాధ్యాయుడిగా పనిచేసే తండ్రి (51)తోపాటు ప్రియుడు (21) తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్లు పేర్కొంది. దీంతో బాధితురాలి తండ్రితోపాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని