గుంటూరు: గుట్కా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

తాజా వార్తలు

Published : 19/07/2020 23:44 IST

గుంటూరు: గుట్కా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

పెదకాకాని: గుంటూరు జిల్లాలో ఓ గుట్కా తయారీ కేంద్రంపై అధికారులు దాడి చేశారు. పెదకాకాని మండలం కొప్పురావూరులో గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు, అధికారులు దాడి చేసి రూ.కోటి విలువైన మూడు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.19లక్షల విలువైన ముడిసరకును స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 25వేల గుట్కా ప్యాకెట్లు, 21 టన్నుల వక్క, 14 బస్తాల యాలకులు, సున్నం, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ మేనేజర్‌గా పని చేస్తున్న జై సింహాతోపాటు సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని