ఫోన్‌కాల్స్‌ చేస్తున్నాడని చంపేశారు.. 

తాజా వార్తలు

Published : 22/10/2020 01:23 IST

ఫోన్‌కాల్స్‌ చేస్తున్నాడని చంపేశారు.. 

చెన్నై : వారం రోజులుగా ఓ వ్యక్తి ఫోన్‌కాల్స్‌ చేసి విసిగిస్తున్నాడనే కారణంతో అతడిని హత్య చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

భర్త చనిపోవడంతో ధనలక్ష్మీ అనే మహిళ ఆమె తల్లి వద్ద ఉంటున్నారు. గత వారం ధనలక్ష్మీకి పెరియసామి(46) అనే వ్యక్తి కాల్‌ చేశాడు. రాంగ్‌నంబర్ అని చెప్పిన ఆమె ఫోన్‌ పెట్టేశారు. అప్పటి నుంచి పెరియసామి ఆ మహిళకు తరచూ ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన ధనలక్ష్మీ ఈ విషయాన్ని తన తల్లికి చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి వాళ్లు పెరియసామిని తమ ఇంటికి ఆహ్వానించారు. 

మంగళవారం మధ్యాహ్నాం ఇద్దరు మహిళలు ఉన్న ఇంటికి వచ్చిన వ్యక్తితో ధనలక్ష్మీ, ఆమె తల్లి వాగ్వాదానికి దిగారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసిన వాళ్ల్లు దారుణంగా కొట్టారు. కాళ్లు, ముఖంపై తీవ్రగాయాలైన ఆ వ్యక్తి అపస్మారక స్థితికి చేరిన పెరియసామి  మృతిచెందారు. అనంతరం మృతదేహాన్ని ధనలక్ష్మీ ఆమె తల్లి వాళ్ల ఇంటి సమీపంలోని రైలు పట్టాల వద్ద పడేశారు. ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు మహిళలపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని