ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురి మృతి

తాజా వార్తలు

Published : 28/04/2021 07:21 IST

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురి మృతి

ముంబయి: మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మరణించారు. ఇందుకు సంబంధించిన వివరాలను థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి వెల్లడించారు. ‘థానేలోని ప్రైమ్‌ క్రిటికేర్‌ ఆస్పత్రిలో ఈ రోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌, ఇతర బాధితులను మరో ఆస్పత్రికి తరలిస్తుండగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాలు ముమ్మరం చేశారు’ అని మున్సిపల్‌ అధికారి వెల్లడించారు. కాగా, రెండ్రోజుల క్రితం కూడా థానేలోని వేదాంత్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఐదుగురు కొవిడ్‌ బాధితులు మరణించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని