పెళ్లి మండపానికి వస్తున్న వరుడి కాల్చివేత

తాజా వార్తలు

Published : 06/02/2020 00:40 IST

పెళ్లి మండపానికి వస్తున్న వరుడి కాల్చివేత

అజాంగఢ్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌): మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుందనగా వరుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ దుర్ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని దేవ్‌గావ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మసీర్‌పూర్‌ బజార్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... 

పెళ్లి ఊరేగింపు సింగ్‌పూర్‌ ప్రాంతం నుంచి బయలుదేరి వివాహ ప్రదేశానికి వచ్చింది. పెళ్లికుమారుడు మండపానికి వస్తుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. వరుడిని వెంటనే బంధువులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.

వరుడి మృతితో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించి వరుడు, వధువు కుటుంబసభ్యులను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హంతకులు వరుడి ఊరేగింపును కొద్ది దూరం నుంచి వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరాలు లేవని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని