వ్యక్తిపై దాడి చేసిన కానిస్టేబుల్‌ సస్పెండ్‌

తాజా వార్తలు

Published : 05/04/2020 01:22 IST

వ్యక్తిపై దాడి చేసిన కానిస్టేబుల్‌ సస్పెండ్‌

గుంటూరు: లాక్‌డౌన్‌ సందర్భంగా ఇటీవల గుంటూరు జిల్లా గురజాలలో వ్యక్తిపై దాడిచేసిన ఘటనలో కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేట పడింది. ఈ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ గ్రామీణ ఎస్పీ విజయరావు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 23న గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద వ్యక్తిపై కానిస్టేబుల్‌ కృష్ణమూర్తి దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. ఆ సమయంలో దాడి ఘటనపై అధికారులకు సమాచారం ఇవ్వనందుకు గురజాల సీఐకి ఛార్జ్‌మెమో జారీ చేశారు. ఘటనా స్థలిలో కానిస్టేబుల్‌ను నిలువరించనందుకు ఏఎస్‌ఐ స్టాలిన్‌కు ఛార్జి మెమో ఇచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని