సరకుల మధ్య దాక్కొని.. పోలీసులకు పట్టుబడి

తాజా వార్తలు

Updated : 15/04/2020 01:10 IST

సరకుల మధ్య దాక్కొని.. పోలీసులకు పట్టుబడి

హైదరాబాద్‌ నుంచి విజయనగరం జిల్లాకు వలస కార్మికులు

విజయనగరం-రింగురోడ్డు: హైదరాబాద్‌ నుంచి నిత్యావసర సరకులతో వస్తున్న రెండు వాహనాల్లో 31మంది వలస కార్మికులు దొంగతనంగా జిల్లాలోకి ప్రవేశించారు. రెండు రోజుల కిందట బయలుదేరిన వీరంతా.. పోలీసుల తనిఖీల సమయంలో సరకుల మధ్య అక్కడక్కడా దాక్కున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటాక జిల్లాలోకి ప్రవేశించి గజపతినగరం చేరుకున్నారు. అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు..  అనుమానం వచ్చి సరకులను పరిశీలించారు. అందులో కొంతమంది వ్యక్తులు ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 31మంది ఉన్నారని, వాహనాల్లో ఇద్దరో ముగ్గురో ఉన్నారనుకుని వివిధ చోట్ల పోలీసులు విడిచిపెట్టి ఉంటారని అధికారులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న వీరిని పార్వతీపురం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి వైద్యపరీక్షలు జరపనున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బాధితుల్లో పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం మండలాలకు చెందిన వారు ఉన్నారు. ఆ రెండు వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని