పెట్టుబడి పేరిట రూ.2.5 కోట్ల మోసం

తాజా వార్తలు

Updated : 14/07/2021 08:23 IST

పెట్టుబడి పేరిట రూ.2.5 కోట్ల మోసం

మాదాపూర్‌, న్యూస్‌టుడే: వ్యాపారంలో పెట్టుబడి పేరిట ఓ వ్యక్తి నుంచి రూ.రెండున్నర కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఇద్దరిని మాదాపూర్‌ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌ విఠల్‌రావునగర్‌లో ఉంటున్న వ్యాపారి ఎర్రగుడ్ల ప్రభాకర్‌ యాదవ్‌కు అదే ప్రాంతానికి చెందిన చైతన్య అనే స్నేహితుడి ద్వారా ఎర్రగడ్డలో ఉంటున్న విజయచంద్ర, కేపీహెచ్‌బీలో ఉంటున్న శివనాయుడు 2019లో పరిచయమయ్యారు. నగరంలో మెడికల్‌ షాపులు నిర్వహిస్తున్నామని వారిద్దరు ప్రభాకర్‌యాదవ్‌ను నమ్మించారు. కొత్తగా మరో 60 మెడికల్‌ షాపులు తెరిచేందుకు బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నామని మాయమాటలు చెప్పారు. రుణం మంజూరైన వెంటనే డబ్బులు తిరిగిస్తామని రూ.రెండున్నర కోట్లు అప్పుగా ఇవ్వాల్సిందిగా ప్రభాకర్‌యాదవ్‌ను కోరారు. వారి మాటలు నమ్మిన అతను తెల్లాపూర్‌లో తనకున్న రెండు విల్లాలను కొల్లూరు ప్రదీప్‌ అనే వ్యక్తి దగ్గర తాకట్టుపెట్టి 2019 జులైలో వారికి రూ.రెండున్నర కోట్లు ఇచ్చారు. ఆరు నెలల్లో డబ్బులు తిరిగిస్తామని చెప్పిన విజయ్‌చంద్ర, శివనాయుడు ఎంతకీ డబ్బు ఇవ్వలేదు. పోలీసులు మంగళవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని