చిత్తూరు: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ

తాజా వార్తలు

Updated : 30/04/2021 11:52 IST

చిత్తూరు: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ


చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్ష్మీనగర్‌ కాలనీలోని నివాసం ఉండే పారిశ్రామికవేత్త డీకే బద్రీనారాయణ ఇంట్లో సుమారు రూ.2.50కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిస్థితిని పరిశీలించారు. కాగా, చోరీ సమయంలో బద్రీనారాయణ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. ఇంటి పైఅంతస్తులోకి చొరబడిన దొంగలు లాకర్‌ను తెరిచి నగలు మాయం చేసినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్‌ టీమ్‌ ద్వారా ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను సైతం పోలీసులు పరిశీలిస్తు్న్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని