టిప్పర్‌ను ఢీకొన్న లారీ.. 20 మందికి గాయాలు
close

తాజా వార్తలు

Updated : 21/06/2021 06:45 IST

టిప్పర్‌ను ఢీకొన్న లారీ.. 20 మందికి గాయాలు

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి మినీ లారీ ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. కడప జిల్లా గోపవరం మండలం పీపీగుంటకు చెందిన పెళ్లి బృందం నెల్లూరు జిల్లా కదలకూరు మండలం గిద్దలూరుకు మినీ లారీలో బయలుదేరింది. మార్గమధ్యంలో ఉప్పలపాడు సమీపంలో జాతీయ రహదారికి ఒకవైపు టిప్పర్‌ ఆగి ఉంది. ఇది గమనించని మినీ లారీ డ్రైవర్‌ అదుపుతప్పి మినీ లారీని వెనకనుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగురికి కాళ్లు, చేతులు విరిగాయి. మరో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని