Fire Accident: కోరుట్లలోని షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం

తాజా వార్తలు

Updated : 18/08/2021 13:33 IST

Fire Accident: కోరుట్లలోని షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలో ఉన్న ఆనంద్‌ షాపింగ్‌ మాల్‌లోని వస్త్ర దుకాణంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పెద్ద ఎత్తున వ్యాపించ భవనం మొత్తం అంటుకున్నాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో షాపింగ్‌ మాల్‌లోని సామగ్రి అంతా కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టినా.. మంటలు అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టింది. అప్పటికే భారీగా ఆస్తినష్టం జరిగింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని