Road Accident: విజయవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

తాజా వార్తలు

Published : 26/09/2021 01:47 IST

Road Accident: విజయవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

విజయవాడ: కండ్రిక సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. రహదారి నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన జాకీలను ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. యువకులు కండ్రిక నుంచి పాతపాడుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతులను వాంబేకాలనీ వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని