Crime News: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

తాజా వార్తలు

Published : 21/09/2021 08:42 IST

Crime News: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

నిడమర్రు: పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రు వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొండాడ సుమంత్ (31), కోడే శరత్ (28) కారులో భీమవరం నుంచి నిడమర్రు వస్తుండగా మందలపర్రు వద్ద కారు అదుపు తప్పి చినకాపవరం కాలువలోకి దూసుకుపోయింది. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నిడమర్రు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని