Disha encounter case: 29న సజ్జనార్‌ను ప్రశ్నించనున్న సిర్పూర్కర్‌ కమిషన్

తాజా వార్తలు

Published : 27/09/2021 16:28 IST

Disha encounter case: 29న సజ్జనార్‌ను ప్రశ్నించనున్న సిర్పూర్కర్‌ కమిషన్

హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు ఛైర్మన్‌గా ఉన్న మహేష్‌ భగవత్‌ను కమిషన్‌ సభ్యులు మరోసారి విచారించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఆయనను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని కూడా విచారించారు. గతంలో అఫిడవిట్‌లోని పలు ప్రశ్నలను సంధించినప్పుడు మహేశ్ భగవత్‌తో పాటు వనపర్తి ఎస్పీ అపూర్వారావు కొంత సమయం అడిగారు. దీంతో ఈ రోజు ఇద్దరూ కమిషన్ ఎదుట హాజరై సదరు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను సిర్పూర్కర్‌ కమిషన్‌ సభ్యులు ఈనెల 29న విచారించనున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు సజ్జనార్‌ సైబరాబాద్‌ సీపీగా ఉన్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని