Crime News: గోడకు రంధ్రమేసి.. అబ్దుల్లాపూర్‌మెట్‌ నగల దుకాణంలో చోరీ

తాజా వార్తలు

Published : 21/09/2021 11:12 IST

Crime News: గోడకు రంధ్రమేసి.. అబ్దుల్లాపూర్‌మెట్‌ నగల దుకాణంలో చోరీ

అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల కేంద్రంలోని గణేశ్‌ నగల దుకాణంలో చోరీ జరిగింది. షాపు నిర్వాహకులు రోజు మాదిరిగానే సోమవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. దొంగలు దుకాణం వెనుకభాగం నుంచి గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. దుకాణంలోని సుమారు ఐదు కిలోల వెండి వస్తువులను దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం గమనించిన దుకాణం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని