close
బాలికపై లైంగిక దాడి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఖమ్మంలో ఆలస్యంగా వెలుగులోకి..

ఖమ్మం నేర విభాగం, న్యూస్‌టుడే: బాలికపై లైంగిక దాడి జరిగిన దారుణ ఘటన ఖమ్మం నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆ బాలిక చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే మరణించారు. నాటి నుంచి బాలికను నగరంలో ఉంటున్న మేనత్త సాకుతోంది. దసరా సెలవులు కావడంతో నగర శివారు రామన్నపేటలో ఉంటున్న దగ్గరి బంధువు ఇంటికి వెళ్లింది. మంగళవారం ఆ బాలికకు జ్వరం వచ్చిందని వాళ్లు మేనత్త ఇంటికి తీసుకొచ్చారు. సాయంత్రం బాలికకు వాంతులై నీరసించి పోయింది. రాత్రి పది గంటల సమయంలో జ్వరం వచ్చిందని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వైద్యులు పరీక్షించి రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని తేల్చారు. ఈ నేపథ్యంలో లైంగిక దాడి విషయమై బాలిక సంబంధీకులు అనుమానం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆ బాలిక కన్నుమూసింది. ఘటనపై బాలిక మేనత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మేనకోడలితో సన్నిహితంగా ఉండే యువకుడు బాలిక మరణానికి కారణమని అందులో పేర్కొంది. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తన ఇంటికి తీసుకెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం మూడో పట్టణ సీఐ శ్రీధర్‌ వెల్లడించారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.