
ప్రధానాంశాలు
ఎస్సై బూటుకాలుతో తన్నారు
తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి భర్త ఆరోపణ
ఒంగోలు నేరవిభాగం, నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: పాత కేసు విషయంలో తనను స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై.. బూటుకాలుతో తన్ని, రైటింగ్‌ప్యాడ్‌తో కొట్టి గాయపరిచారని ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేటర్ అభ్యర్థి భర్త శుక్రవారం ఆరోపించారు. బాధితుడు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. ఒంగోలు మంగమూరు రోడ్డు వడ్డెవానికుంటకు చెందిన జగన్నాథం మురళి ఎస్సీ కార్పొరేషన్లో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య శారదాదేవి 33వ డివిజన్ నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచారు. నాగులుప్పలపాడు స్టేషన్ నుంచి సిబ్బంది ఒంగోలు వచ్చి.. 2019లో నమోదైన మోసం కేసులో విచారణ కోసం స్టేషన్‌కు రావాలని మురళిని కోరారు. ఆ కేసులో అప్పట్లోనే రాజీ చేసుకున్నామని, ఇప్పుడు ఎందుకు పిలిపించారని ఎస్సై శశికుమార్‌ని మురళి ప్రశ్నించారు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎస్సై తనను బూటుకాలుతో తన్ని, రైటింగ్ ప్యాడ్‌తో దాడి చేసి, దుర్భాషలాడారని మురళి ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచరులతో కలిసి నాగులుప్పలపాడు వెళ్లారు. అప్పటికే పోలీసులు మురళిని విడిచిపెట్టారు. అక్కడికి చేరుకున్న జనార్దన్ బాధితుడి చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఈ విషయమై ఒంగోలు గ్రామీణ సీఐ పి.సుబ్బారావు మాట్లాడుతూ.. పెండింగ్ వారంటు విషయంలో మురళిని నాగులుప్పలపాడు ఎస్సై స్టేషన్‌కు పిలిపించిన మాట వాస్తవమేనన్నారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని.. మురళి భార్య తెదేపా తరఫున ఎన్నికల్లో పోటీచేస్తున్న విషయం తమకు తెలియదన్నారు.
మరిన్ని
సినిమా
- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- భారత్‌లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
- కార్చిచ్చులా కరోనా
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
