పుట్టిన రోజు ఘనంగా చేయలేదని..

ప్రధానాంశాలు

Published : 29/04/2021 06:37 IST

పుట్టిన రోజు ఘనంగా చేయలేదని..

కుమారుడి ప్రాణం తీసింది  
కర్నూలు జిల్లాలో తల్లి ఘాతుకం

రుద్రవరం, న్యూస్‌టుడే: కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి ఆ చిన్నారి గొంతుకోసి ప్రాణాలు తీసింది. కుమారుడి పుట్టిన రోజు వేడుకల్ని, తన బావ కుమారుడి పుట్టిన రోజు వేడుకలా ఘనంగా చేయలేదన్న అసూయతో ఈ ఘాతుకానికి పాల్పడింది. కర్నూలు జిల్లా రుద్రవరానికి చెందిన రైతు సుధాకర్‌కు తన సొంత అక్క కుమార్తె మౌనికతో మూడేళ్ల కిందట వివాహంకాగా విక్రమ్‌(1) జన్మించాడు. గతంలో సుధాకర్‌ అన్న కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 26న విక్రమ్‌ మొదటి పుట్టిన రోజు వేడుకల్ని కూడా అలాగే ఘనంగా నిర్వహించాలని మౌనిక పట్టుబట్టింది. సుధాకర్‌ మాత్రం సాదాసీదాగా చేశారు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయలు కోసే కత్తితో కుమారుడి గొంతు కోసింది. అనంతరం బంధువులు తనను ఏమైనా చేస్తారన్న భయంతో మౌనిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటి బయటికొచ్చి వాంతులు చేసుకుంటుండగా స్థానికులు గమనించి ఇంట్లోకి వచ్చి చూడగా రక్తపు మడుగులో నిర్జీవంగా ఉన్న విక్రమ్‌ కనిపించాడు. మౌనికను నంద్యాలకు తరలించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన