కడుపు మంట మిగిల్చిన పంట
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

కడుపు మంట మిగిల్చిన పంట

మిరప తోటను ట్రాక్టర్‌తో తొలగిస్తున్న రైతు

యడ్లపాడు, న్యూస్‌టుడే : పుడమిని నమ్ముకుని శ్రమించిన రైతుకు కాలం కలసి రాలేదు. యడ్లపాడుకు చెందిన రైతు ముత్తవరపు మోహన్‌ ఈ ఏడాది రెండు ఎకరాల్లో మిరప తోట వేశాడు. మొక్కదశలో అక్కడ జెమినీ వైరస్‌ (బొబ్బర) కనిపించినా అధైర్యపడకుండా శాస్త్రవేత్తల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాడు. ఖర్చుకు వెనకాడకుండా రూ.లక్ష ఖర్చు చేశాడు. అంతకంతకు వైరస్‌ పెరిగి పోవటంతో దిగుబడులపై ఆశలు వదులుకున్నాడు. చేసేది లేక 90 రోజులు కష్టపడి పెంచుకున్న మిరపతోటను గురువారం ట్రాక్టర్‌తో దున్నివేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని