పిడుగుపాటుతో యువకుడి మృతి
eenadu telugu news
Updated : 18/10/2021 06:30 IST

పిడుగుపాటుతో యువకుడి మృతి


కోటేష్‌

కోటపల్లి, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెల్మపల్లి గ్రామానికి చెందిన ముక్కినవేణ కోటేష్‌(20) పిడుగుపాటుతో ఆదివారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్మపల్లికి చెందిన లక్ష్మిమల్లు- రాజక్క దంపతులకు ఆరుగురు సంతానం. నాలుగోవాడైన కోటేష్‌ మంచిర్యాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడు. ఆదివారం గొర్రెలను మేత కోసం ఆటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో అతనికి సమీపంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని