Published : 21/04/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏ రకం ధాన్యమైనా కొనుగోలు చేస్తాం: జేసీ కె.మాధవీలత

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో 497 కేంద్రాల ద్వారా రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిర్ణయించినట్టు జాయింటు కలెక్టరు కె.మాధవీలత మంగళవారం తెలిపారు. ఇప్పటికే 200 కేంద్రాల్లో కసీన మద్దతు ధరకు నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దళారులు/ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించ వద్దని ఆమె రైతులకు సూచించారు. ఏ రకం ధాన్యమైనా కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. ఈనెల 20వ తేదీన ‘రబీ ధాన్యానికి దళారులే దిక్కు’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు తమ సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంగా మార్పు చేసిన ఆర్బీకే వద్దనే నమూనాలను ఇచ్చి ధాన్యాన్ని విక్రయించుకోవచ్చన్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా కొనుగోలు కేంద్రాలు. గుడివాడ- 52, మచిలీపట్నం- 88, నూజివీడు - 171, విజయవాడ -186.

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ 17 శాతం వరకు ఉన్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు స్వీకరిస్తున్నట్టు జేసీ కె.మాధవీలత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తేమ శాతం నిర్ధారణ పరీక్షలను రైతు భరోసా కేంద్రాల్లో మాత్రమే చేయించాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని