Published : 21/04/2021 05:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయండి

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవాని ఆదేశించారు. ఈమేరకు ఎంఈవోల ద్వారా హెచ్‌ఎంలకు సమాచారం పంపారు. విద్యార్థుల నిర్మాణాత్మక మూల్యాంకనం మార్కులు స్టూడెంట్‌ ఇన్‌ఫో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో పైతరగతులకు వెళ్లే విద్యార్థుల వివరాలు ఎంఈవోలకు పంపాలని సూచించారు. నాడు- నేడు పథకంలో పెండింగ్‌ పనులు ఈ నెలఖరు లోపుగా పూర్తి చేయాలని ఆదేశించారు. 2020- 21 విద్యాసంవత్సరం యూడైస్‌ వివరాలను అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా తగిన సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేయండి.. అమ్మఒడి పథకంలో ల్యాప్‌టాప్‌ కావాలా.. రూ.15 వేలు కావాలా అనేది 8, 9, 10 తరగతుల విద్యార్థుల నుంచి ఆప్షన్‌ ఫారాలను తీసుకోవడంతో పాటు ఛైల్డ్‌ ఇన్‌ఫో వెబ్‌సైట్‌లో బుధవారం సాయంత్రం లోపు నమోదు చేయాలని డీఈవో గంగాభవాని సూచించారు. ప్రైవేటు పాఠశాలల వారు కూడా వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టేలా ఉపవిద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ ఆదర్శ, గిరిజన సంక్షేమ, ఏపీ గురుకుల పాఠశాలలు, కేంద్రీయ, నవోదయ విద్యాయాలు, కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ ఉన్న చోట్ల ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థుల నుంచి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఆన్‌లైన్‌ నమోదులో ఎటువంటి జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని