వివరాలు ప్రదర్శించాల్సిందే
Published : 16/05/2021 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివరాలు ప్రదర్శించాల్సిందే

మరో 100 పడకలు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి కేటాయించిన పడకల వివరాలను ప్రముఖంగా ప్రదర్శించాలని రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని ఆదేశించారు. నగరంలోని కలెక్టరు విడిది కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో పేర్ని మాట్లాడుతూ.. అన్ని ఆసుపత్రుల్లో కొవిడ్‌ మార్గదర్శకాల మేరకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పలు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందించడానికి నిరాకరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్ని ప్రైవేటు ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. నిబంధనలను పాటించకుండా, ఇబ్బందులకు గురిచేస్తున్న యాజమాన్యాల పట్ల కఠిన వైఖరి అవలంభించాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత సేవలు అందిస్తూ.. డబ్బులు వసూలు చేస్తున్నట్టు వస్తున్న ఫిర్యాదుల వివరాలను తెలియజేయాలని అధికారులను కోరారు. కొవిడ్‌ టీకాపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరు ఇంతియాజ్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జేసీ ఎల్‌.శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని