రూ.1.5 కోట్లతో ఆక్సిజన్‌ పైపులైను
logo
Published : 13/06/2021 03:38 IST

రూ.1.5 కోట్లతో ఆక్సిజన్‌ పైపులైను

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: కరోనా మూడోదశ అంటూ వస్తే అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సర్వజనాసుపత్రిలో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. మూడోదశలో పిల్లలు ఎక్కువ మంది ఈ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లల విభాగంలో అన్ని పడకలకు ఆక్సిజన్‌ పైపులైను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఆప్తమాలజీ, ఈఎన్‌టీ విభాగాల్లోనూ ఆక్సిజన్‌ పైపులైను బిగించనున్నారు. ఇందుకు రూ.1.5 కోట్ల వ్యయంతో అంచనాలు తయారు చేసి శనివారం ఉన్నతాధికారుల అనుమతికోసం పంపారు. అక్కడి నుంచి అనుమతి రాగానే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి గుత్తేదారుడిని ఎంపిక చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని