బ్లాక్‌ ఫంగస్‌తో తెదేపా నాయకుడి మృతి
logo
Published : 13/06/2021 03:47 IST

బ్లాక్‌ ఫంగస్‌తో తెదేపా నాయకుడి మృతి

జి.కొండూరు, న్యూస్‌టుడే: బ్లాక్‌ఫంగస్‌ బారినపడి చికిత్స పొందిన చెర్వుమాధవరం గ్రామ తెదేపా అధ్యక్షుడు బాణావత్తు సక్రియా(40) శనివారం తన నివాసంలో మృతి చెందారు. సక్రియాకు తొలుత కరోనా సోకి చికిత్స అనంతరం తగ్గిపోగా బ్లాక్‌ఫంగస్‌ సోకింది. దీంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి, తరువాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం లభించలేదనే ఉద్దేశంతో ఇంటికి వచ్చిన కొద్ది రోజులకు కుటుంబ సభ్యులు అతడిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ముగించుకొని కొద్ది రోజుల కిందట ఇంటికి రాగా ఉదయాన్నే మృతి చెందాడు. మృతునికి భార్య, ఏడు, ఐదో తరగతి చదివే ఇద్దరు కుమారులున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెదేపా మండల అధ్యక్షుడు పజ్జూరు రవికుమార్‌తో కలిసి సక్రియా భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని