గంజాయి విక్రయిస్తున్న ఏడుగురి అరెస్టు
logo
Published : 16/06/2021 02:59 IST

గంజాయి విక్రయిస్తున్న ఏడుగురి అరెస్టు


స్వాధీనం చేసుకున్న గంజాయితో నిందితులను చూపుతున్న సీఐ అంకమరావు, ఎస్సై నారాయణ, సిబ్బంది

మంగళగిరి, న్యూస్‌టుడే: నగరంలోని బస్టాండ్‌ వద్ద మంగళవారం 4.5 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని ఏడుగురు యువకులను అరెస్టు చేసినట్లు అర్బన్‌ సీఐ బొప్పన అంకమరావు తెలిపారు. పాతూరుకు చెందిన కొలనుకొండ పవన్‌కల్యాణ్‌, మంగళగిరిలోని రత్నాలచెరువు వాసి బిట్రా దిలీప్‌, గోపాలకృష్ణ థియేటర్‌ వద్ద ఉంటున్న వేముల సాయి, దుగ్గిరాల మండలం చినపాలెం గ్రామవాసి మల్లవరపు పృథ్వీ, పెదవడ్లపూడికి చెందిన ఇస్సారపు దిలీప్‌ వెంకట నాగార్జున, పాతూరు వాసులు రేమళ్ల వెంకటేశ్వరరావు, కొపూరి పవన్‌కల్యాణ్‌ అరెస్టు అయిన వారిలో ఉన్నారని ఆయన చెప్పారు. డీఎస్పీ డి.దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో తాను, ఎస్సై నారాయణ, సిబ్బందితో కలిసి బస్టాండ్‌ వద్ద వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడుగురు యువకులు యశ్వంత్‌ అనే వ్యక్తితో కలిసి చెడు అలవాట్లకు బానిసలయ్యారన్నారు. వీరి బలహీనతలను ఆసరాగా చేసుకొని సాంబిరెడ్డి, హర్షారెడ్డి అనే వ్యక్తులు డబ్బు ఆశ చూపి గంజాయి అమ్మిస్తున్నారని సీఐ వెల్లడించారు. రూ.1000ల గంజాయి విక్రయిస్తే ఒక్కొక్కరికి రూ.200 వంతున చెల్లిస్తున్నారని తెలిపారు. మిగిలిన నిందితులు యశ్వంత్‌, సాంబిరెడ్డి, హర్షారెడ్డి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని ఆయన వివరించారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ అర్బన్‌ సీఐ, ఎస్సై, సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని