పోలీసుల కుటుంబాలకు రూ.23 లక్షల అందజేత
eenadu telugu news
Published : 27/07/2021 05:08 IST

పోలీసుల కుటుంబాలకు రూ.23 లక్షల అందజేత

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : పోలీసు శాఖలో పనిచేస్తూ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సోమవారం పోలీసు కార్యాలయంలో రూరల్‌ ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి చేతుల మీదగ రూ.23 లక్షల చెక్కులు అందజేశారు. హెచ్‌సీ సత్యనారాయణ కుటుంబ సభ్యులకు రూ.7.48 లక్షలు, హెచ్‌సీ సుబ్బారావు కుటుంబ సభ్యులకు రూ.3.99 లక్షలు, ఏఆర్‌ హెచ్‌సీ దిలీప్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు రూ.4 లక్షలు, ఏఎస్సై వెంకటరావు కుటుంబ సభ్యులకు రూ.4 లక్షలు, పీసీ నాంచారయ్య కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చెక్కులను అందించారు. పోలీసు అధికారుల సంఘం గ్రామీణ అధ్యక్షుడు మాణిక్యాలరావు, ఏవో శివప్రసాద్‌, డీపీఓ సూపరింటెండెంట్‌లు వెంకటేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని